Book Description
‘తమ్ముడూ! నువ్వు నన్నుమించి ఎదిగిపోయావురా. కాని వినతకు అన్యాయం జరిగిందనే నా బాధ’ అన్నాడు శశాంక. నంద చిదానందంగా నవ్వుతూ ‘ఎవరికీ’ అన్యాయం జరగలేదు. అందరికీ జరిగింది న్యాయమే’ అన్నాడు. తనకు పెళ్ళివద్దు అని భీష్మించుకుని తవ్మడి పెళ్ళి కోసం, తల్లి తృప్తికోసం ఆరాటపడిన శశాంక హేమను అర్థం చేసుకోవడంలో పొరబడ్డాడు. ఆమె యిప్పుడు తవ్మడి సరసన పెళ్ళి అలంకరణతో గర్వంగా నిలబడివుంది. జీవన సహచరిని గురించి శశాంక వలె నంద కమ్మని కలలేవీ కనలేదు. హేమ చాలు అతడికి. మరి వినత సంగతి? చివరిక్షణంవరకూ ఆమెకూ తవ్మడికీ పెళ్ళి చేద్దామనుకున్న శశాంకకు తవ్మడు వ్యతిరేకించినకొద్దీ అతని పట్టుదల పెరుగుతూ వచ్చింది. చివరకు ఈ సమస్య ఎలా పరిష్కారమైంది? ‘మనసు ఒకరికే మనిషి ఒకరికే అన్న నంద మాటలలోని ఆంతర్యం? హుషారైన అన్నదవ్మల కథ. ‘‘మనసు ఒకరికే-మనిషి ఒకరికే’’ చదవండి.