Book Description
బోర్లా పడి ఉన్న ఆ స్త్రీ జాకెట్ మెడ దగ్గర చిరిగిపోయి ఉంది. చేతి గాజులు చిట్లి గదినిండా పడి ఉన్నాయి. జడ విచ్చుకుపోయి, జుట్టు భుజాల్నీ, ముఖాన్నీ కప్పివేసింది. కిశోర్ ధైర్యం కూడదీసుకొని ఆమెను సమీపించాడు. ఆమెను వెల్లకిలా పడపుకో బెట్టబోతూ షాక్ తిన్నట్టు మ్రాన్పడిపోయాడు. ‘‘మైగాడ్! యమున!’’ కిశోర్, యమునల వివాహం బొమ్మలపెళ్లిలా జరిగిపోయింది. ఆ పిల్ల మెడలో మాంగల్యం కట్టిన గుర్తు కూడా లేదు అతడికి. ఏడెనిమిదేళ్ల యమునకు కట్టబెట్టిన పట్టుచీర జారిపోతుంటే ముత్తయిదువుల నవ్వుకోవడం, చెండాట కూర్చోబెడితే నిద్ర ముంచుకువచ్చి ఆ పిల్ల తన ఒళ్లో తలపెట్టుకు పడుకోవడం మాత్రం లీలగా గుర్తున్నాయి అతడికి... కట్టుకున్న భర్తకు దూరమై, సుఖమనేది తెలియకుండా బ్రతుకు వెళ్లమార్చిన యమున అపరిపక్వమైన ఆలోచనలతో ఒక్కసారి తప్పటడుగు వేసింది. దానితో మంచుముత్యంలాంటి యమునను అందరూ అపార్థం చేసుకున్నారు. ఆమె జీవితానికి పుట్టిన గ్రహణం విడిచేనా? అడుగడుగునా ఊహించని మలుపులతో సాగిన ‘‘ఆంధ్రభూమి’’ మాసపత్రిక సీరియల్ ‘‘మంచుముత్యం’’ పోల్కంపల్లి శాంతాదేవి విశిష్ట రచన. చదవండి!