Book Description
మిగతా ఆడవాళ్ళకంటే ఎత్తుగా పుష్టిగా వుండే ఆమెది అల్ల నేరేడు పండు రంగు శరీరం. కంబాల చెరువుల్లాంటి కళ్ళు. ఆమె నవ్వితే గురు పౌర్ణమి నాటి వెన్నెల అక్కడ పరుచుకుంటుంది. ఏడిస్తే అఖండ గోదావరి అక్కడ పొంగి పొర్లిపోతుంది. సూర్యుడుదయించి అస్తమించేలోపు తనకెదురైన మనుషుల్తో రెండో మూడో ముక్కలు మాటాడే ఆమె అద్భుతంగా మాటాడేది అద్దంతో మాత్రమే. ఆ మనిషెవరంటే... రాణి...మన్యంరాణి...వెన్నెలరాణి.