Book Description
‘‘రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీల్తోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు’’ అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే అతన్తో కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిన గరాజీలూ, నాన్‍రొట్లూ, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లాం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది. మొండెపులంకలో జీలకర్ర అట్టు, నాగుల్లంకలో సిట్రా సోడా తాగించిన అక్కిరాజు ‘‘టైముంటే రేపు పి. గన్నవరం వెళదావండి’’ అన్నాడు. ‘‘ఎందుకు సార్?’’ అన్నాడు వెంకటేష్. ‘‘ఆ వూళ్ళో సుబ్బారావు బాదంపాలు చాలా బాగుంటాయి’’ అంటా ఇంకా ఏదో మాటాడ్తుంటే రాజోలు సెంటర్లో ఆగింది ఇన్నోవా. ఆ బండి చుట్టూ ఒకటే జనం. మేవడిగిన పెసరపొణుకులు సందకాడే అయిపోయినియ్యంట. వంశీ అంటే గోదారి. గోదారంటే వంశీ. విడివిడిగా ఈ ఇద్దరినీ చూడలేము. గలగలపారే గోదారి లాంటి వంశీ ఎన్నో మలుపులు, ఎత్తు పల్లాలు తన అనుభవంలోంచి కొన్ని మనకూ చెప్పారు. చదవండి.