Book Description
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అతనికోసం అమ్మనాన్నలను వదులకుంది. అతడే సరస్వం అనుకుంటున్నవేళ, ఇద్దరు పిల్లల తల్లిని చేసి, భవబంధాలు వద్దంటూ సంసారం నుంచి పారిపోయాడు. ఒంటరి స్త్రీగా అవస్థలు పడుతూ,వ్యవస్థతో నెట్టుకొస్తున్న మేధకి. తోడున్నానంటూ తిరిగి వచ్చిన భర్త రజనీని చూసి భార్యగా ఎలా స్పందించింది? స్త్రీ’ప్రేమించే హృదయాన్ని’ కించపరచి,నిర్లక్ష్యం చేసి వెళ్ళిన పురుషుడు తిరిగివస్తే స్త్రీ అతన్ని క్షమించలా?అవసరం లేదా? తను క్షమించదు.అతను క్షమించేట్టు ప్రేమతో,ఓర్మితో చేసుకుంటాడుట. నవలా దేశపు రాణి యద్దనపూడి సులోచనా రాణి నవల “మౌనపోరాటం”