Book Description
ఒకనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, వైజ్ఞానిక విశేషాలను గురించి తెలుసుకోవాలంటే, మనం ఎక్కువగా చరిత్ర పుస్తకాలపైన ఆధారపడవలసి ఉంటుంది. లేదా ఆయా రంగాలలో సుప్రసిద్ధులైనవారి స్వీయచరిత్రలో, జీవిత చరిత్రలో చదవవలసి ఉంటుంది. కానీ - నిజాయితీతో కూడిన ఆయా ఘట్టాలకు కొంత కల్పనా రామణీయత కూడా తోడయితే - ఆ రచన చదవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సామాన్య పాఠకులను సైతం ఆకర్షించి చదివించే ప్రజా సాహిత్యంగా రూపుదిద్దుకుంటుంది. ‘‘మజిలీ’’ నవల చేసింది అదే. ఈ నవల చదివి ముగించాక, పాఠకుడికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాననే అనుభూతి కలుగుతుంది. ప్రయోజనకరమైన సాహిత్యానికి ప్రధానంగా ఉండవలసిన గుణం ఇదే.