Book Description
శ్రీ రావులపాటి సీతారాంరావు గారు జగమెరిగిన సాహితీవేత్త. తెలుగుపాఠకలోకానికి కథకులుగా, నవలాకారునిగా, విమర్శకునిగా, వృత్తిపరంగా వ్యక్తిత్వ వికాస ప్రోత్సాహకునిగా సుపరిచితులు. వారి కథలూ, హృదయవేదం, బ్రతుకుబొంగరం వంటి నవలలూ సాహితీపరుల ప్రశంసల్ని పొందాయి. పోలీసుశాఖలో ఎంతో ఉన్నత పదవిని నిర్వహించిన సీతారాంరావుగారు ‘ఉద్యోగ విజయాలు’ (పోలీసుసాక్షిగా), ‘అన్నీ చెప్పేస్తున్నా’ లాంటి రచనలు చేసి కార్యనిర్వహణ శైలినీ - యదార్థవాదిగా పాఠకలోకానికి అందించారు. సీతారాంరావుగారు చింతనాపరులూ, సామాజిక బాధ్యత నెరిగిన సాహితీకారులు కావటం వలన వారి మననధార ఇంకా ప్రయోజనాత్మక జాతి సంపదైన మన ఇతిహాసాలవైపు మరలింది. \nఅందుకే ఇప్పుడు ‘సీతారామాయణం’, ‘మహాభారతం’, ‘శ్రీకృష్ణావతారం’, ‘గీతానుబంధం’తోపాటు అనుబంధంగా ‘చాణక్యుడు-రాజనీతి’ని ఎమెస్కో ద్వారా పాఠకులకు అందిస్తున్నారు.