Book Description
యాత్ర అంటే ఏమిటి? ప్రాంతాలను మాత్రమే సందర్శిస్తే అది సంపూర్ణ యాత్ర అవుతుందా? ప్రాంతాలతో పాటు అక్కడి మనుషులను చూసి, కలిసి, వారి కతలను విని వారితో ముచ్చటిస్తేనే ఆ యాత్ర సంపూర్ణంగా సార్థకమవుతుంది. దీనినే ఇంగ్లీష్‍లో "Maps and chaps" లేదా "Places and People" అంటారు. నాకు తెలిసిన మేరకు యాత్రా సాహిత్యాన్ని రచించిన వి.యస్.నైపాల్, విలియం డార్లింపుల్, విక్రమ్ సేఠ్‍లు ప్రాంతాలు, ప్రజలు, చరిత్ర, రాజకీయ, సాంఘీక పరిస్థితులను పరిశీలిస్తూ ఈ కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వహించారు. తెలుగులో వస్తున్న యాత్రా సాహిత్యం (Travelogues) ఆ స్థాయిని అందుకోవాలని నా అభిలాష.