Book Description
పోలీసుల విధులన్నీ నేర నిరోధన, నేర పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణలతోనే ముడిపడి వుంటాయి. నేర నిరోధన కోసం తరచుగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ప్రతి పోలీసు ఉద్యోగికీ కలుగుతంది. ఊరేగింపులు, ధర్నాలు, సమ్మెలు చేసేటప్పుడు ఆందోళనకారులు ఉన్నంత సంఖ్యలో పోలీసులు ఉండరు. ఆ సమయాల్లో ఏదైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే అత్యంత చాకచక్యంగా, తెలివితో నెగ్గుకు రావాల్సిన అవసరం ఉంది. "The mob has many heads but no brains" అన్న సామెతను మాత్రం మన పోలీసులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. గుంపుగా గుమిగూడిన జనం ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయ స్థితిలో విధ్వంసానికి, హింసాకాండకు పూనుకుంటారు. వాళ్ళు ఆలోచించే విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతారు. పోలీసుల గురించి చక్కటి అవగాహన కలిగించే ఈ అపురూప ‘నవల’ చదవండి.