Book Description
‘‘జీవితం చివరి మెట్టు మీద నిలబడిన మనిషికి ఈ ప్రపంచమంటే భయం వుండదు. ఎవరేమన్న లెక్కవుండదు. అందుకే ఇంత ధైర్యంగా నా జీవితంలోకి దాచుకొన్న రహస్యాన్ని చెప్పి వేయగలిగాను’’ అని ముగించి గీతాభవాని. అయితే విషయం సామాన్యమైంది కాదు. పెళ్ళి కాని వయసు కన్నెపిల్ల మనసైన వాడికి బలియై లోకాన్నెదిరించలేక మరొక అభాగ్య శిశువును కని కళ్లు తెరవని పసికందును అవతల పారేసింది. ఇపుడు ఇరవైయేళ్ల తర్వాత రాగూడని పరీక్ష రానేవచ్చింది. తనను కన్నకూతురిగా గుర్తిస్తే తప్ప రానని భీష్మించిన ప్రేమికారాణి హదయం ఇక్కడ లభించిన పిత ప్రేమకు పున్నమినాటి సముద్రంలా పొంగిపోయింది. అన్నిటికీ మించి విశాల్ వంటి ధీరోదాత్తుడు, విశాల హదయుడు పట్టు వదలక తమ జీవిత వత్తాంతాలకు పరిష్కారం సాధించాడు. ‘శుభం’ నుండి ‘సమాప్తం’ వరకు పదరసవంతమైన వినూత్న పాత్ర చిత్రణతో, జనన్వోపు నడక వంటి కధన కౌశలంతో సాగిన రచన.