Book Description
ప్రపంచములో అనేకమతము లున్నవి. వీని ననుసరించు వ్యక్తులయొక్క నిత్య జీవితవిధానము ఈ మతములయొక్క సంప్రదాయములకు లోనయి వర్తించుచున్నది. ఈ సంప్రదాయములే వివిధమతముల మధ్యగల అంతరములకు మూలమగుచున్నవి. వైదిక (హిందూ) మతములో ఈసంప్రదాయములు వ్యక్తియొక్క చతుర్విధపురుషార్థ సాధనకు దోహదకారులుగా మన ఋషులచేత ఏర్పరుపబడినవి. ఈసంప్రదాయము లకు మూలములు ఆఋషులచేత నిర్దేశింపబడిన షోడశ (16) సంస్కారములు.