Book Description
మెదడు పని చేసేవిధానం, తెలివితేటల్లో ఉండే ప్రత్యేకతలను, పిల్లలు నేర్చుకోవడంలో ఉపయోగించే ప్రత్యేక పద్ధతులను, చదువుకోవడంలో సంతోషం, దుఃఖం వంటి ఉద్వేగాల పాత్రను, పిల్లల ప్రవర్తనా రీతులను, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, మరిచిపోవడం అనే అంశాలను తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య సత్సంబంధాలు ఉండడమేగాక, పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. ఈ ఏడు అంశాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఏడు సూత్రాలుగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.