Book Description
ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు. \n”నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను… ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది…”