Book Description
చిత్రకళా రేఖా మాధుర్యాలలో దేనికది, ఓ నలుపు తెలుపుల అందమైన బొమ్మ! పెద్ద సైజులో కాపీ చేసుకుని రంగులు నింపుకోడానికీ, ఆ మురిపాన్ని పిల్లల్లో చూసుకోడానికీ, ఈ ప్రేరణతో వేరే రేఖాలయలు సృజియించడానికీ, నచ్చిన వాటిని, మీ ఊహకు తగ్గట్టుగా ఎంబ్రాయిడరీ చేసి కావాల్సిన చోట చక్కగా అలంకరించుకోడానికీ, శుభ కలయిక వేడుకల్లో వేడుకగా ఆత్మీయులకు బహుమతిగా భాషా భేదం లేకుండా యివ్వడానికీ.... ఈ డిజైన్లు వందల సంఖ్యలో సృష్టించవచ్చు, వేలు దాటినా ఆశ్చర్యం లేదు. అయితే ఒక నమూనా ఆధారం కోసం వేసినవి, చూడముచ్చటగా వుంటూ ఆ ప్రేరణతో మీరు మీ మనసుకి నచ్చినట్లుగా వస్తు సౌకర్యంగా మార్చుకోవచ్చు. అవసరమైన ఆభరణాలుగా దారు శిల్ప కళతో, పిల్లలకు చిత్రకళా సాధనలో భాగంగా, ఎన్నో సందర్భాలలో అలంకరణ యోగ్యం, అది వారి ఊహా వినియోగం బట్టి వుంటుంది. ముఖ్యంగా స్త్రీలు రంగవల్లులు దిద్దుకోడానికి ముచ్చటగా వుంటాయి....