Book Description
పట్టాలమీద నడిచే రైలుబండ్ల ఆలోచన మొదట మనిషికి ఎలా వచ్చింది? మనం ఈనాడు ప్రయాణసాధనంగా వాడుతూ, దానిలోని సదుపాయాలను అనుభవిస్తున్న రైలు ఎప్పుడు ఎలా రూపొందింది? ఈనాటి రైలు ఒక్కరోజులో తయారయ్యి పట్టాలమీద నడవలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో రైలు ఎలా వుండేది? తరువాత దశలవారీగా ఎలా రూపాంతరం చెందింది? రైలుకు పూర్వం ఎటువంటి ప్రయాణసాధనాలు వుండేవి? రైలు ప్రయాణంలో మొదట్లో లేని సౌకర్యాలు ఎలా పెంపొందాయి? రైలుబ్రిడ్జి మీద నడుస్తున్నప్పుడు, మామూలు మార్గంలో నడుస్తున్నప్పుడూ, లెవల్ క్రాసింగులు, రైల్వేస్టేషనులు, బ్రిడ్జిలు దాటుతున్నప్పుడు శబ్దం వేరువేరుగా ఎందుకు వుంటుంది? మెయిన్‍లైను నుంచి లూపులైనులోకి మారుతూ వున్నప్పుడు ఒక రకమైన స్క్రీచింగ్ శబ్దాలు ఎందుకు వస్తాయి? రైలు ట్రాకుకు కొంత దూరంలో వున్నవారికి ప్యాసింజరు రైలు వెళ్ళే సమయంలో, గూడ్సు రైలు వెళ్ళే సమయంలో శబ్దాలలో తేడా ఎందుకు వుంటుంది? జాగ్రత్తగా గమనిస్తే ట్రాకుకు ఎడమ ప్రక్కగా కొన్ని సూచికలుంటాయి. అవి ఎవరికోసం ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? వీటన్నిటికీ సమాధానాలు ఈ రైలు కథలో సరియైన వివరణతో ఇవ్వటం జరిగింది.