Book Description
‘సలాం హైద్రాబాద్’ అనే ఈ నవలలో ‘పైదాయిషీ హైద్రాబాదీ’ పరవస్తు లోకేశ్వర్ హైద్రాబాద్‍ను మన కళ్ల ముందుంచినాడు. ఇందులో నగరపూర్వ సంస్క•తి, ఈ తరంవాళ్లకు తెలియని అనేక విషయాలు ప్రస్తుతీకరింపబడినవి. హైద్రాబాద్ అన్నపూర్ణ, ఎక్కడెక్కడి జాతులవాళ్లో వచ్చి స్థిరపడి తాము బాగుపడి, నగరాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచారు. ఇక్కడి మూలవాసుల్లో కలిసిపోయి, మూలవాసుల ఉద్యమాల్లో పాల్గొన్నారు. తరువాత వచ్చినవాళ్లు మరికొందరు ఇక్కడివాళ్ళ సంస్కారాన్ని, భాషను, యాసను పరిహసించి తామే గొప్ప వాళ్లమన్నట్లు ప్రవర్తించినారు. ఈ నవలలో ఇవన్నీ వైనంవారిగ చెప్పుకొచ్చినాడు. అప్పటి ఆచార్యవ్యవహారాలు, ఆటపాటలు, ఇరానీ హోటళ్లు, ఏక్ మె దో చాయ్, బిర్యానీ, తందూరీ రోటీలే కాక అనేక చారిత్రకాంశాలు, మహలఖాబాయి చందా, పాట్రిక్ ఖైరున్నిసా ప్రేమ వ్యవహారమూ, 1857 సిపాయిల తిరుగుబాటు కూడా ఉన్నాయి. ఇదొక ‘హైద్రాబాదీ’ ఆత్మకథ.