Book Description
అతను మెల్లగా తన నడుంచుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు. తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని,వెనక్కి ఆనించి దిండుమీద పడుకోబెట్టాడు. ఆ పడుకో బెట్టడంలో అన్నూ పయిట జారిపోయింది…. అతను లాకెట్ చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు. వంగి,ఆ లాకెట్ చేతుల్లోకి పట్టుకొని మరింత శ్రద్ధగా పరీక్షగా చూసాడు. సందేహం లేదు. ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టి చేతుల జాకెట్టు,కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, అరవిరసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు యింకెవరు? పారిజాతమే! నిశ్చేష్టుడయ్యాడు. అతని చూపులు ఆ లాకెట్టుకు అతుక్కు పోయినట్టుగా నిల్చిపోయినాయి.