Book Description
కీ.శే. అధరాపురపు విఠల్రావుగారు సమాచార మరియుపౌర సంబంధాలశాఖలో వివిధ హోదాలలో పనిచేసి 1992వ సంవత్సరంలో డిప్యూటి డైరెక్టర్గా విజయవాడలో పదవీ విరమణ చేశారు. పదవీ కాలంలో సమర్ధులైన పరిపాలకునిగా, స్నేహసౌజన్యశీలిగా ఎందరో కళాకారులకు స్ఫూర్తి ప్రదాతగా, ముఖ్యంగా సమాచార శాఖలో సీనియర్ పాత్రికేయునిగా పేరు గడించారు. సంఘసేవాతత్పరుడు అయిన ఆయన పదవీ విరమణానంతరం బహు మాస, వార, దిన పత్రికా పఠనంతో బాటు బహుగ్రంథ పఠనాసక్తితో గ్రహించిన విశేషానుభవంతో, రచనావ్యాసంగంపైగల ఆసక్తితో ‘ఉపాధ్యాయ చైతన్య’ అను ఉపాధ్యాయుల మాస పత్రికకు ప్రతి నెలా ‘కవర్ స్టోరీ’ని వ్రాయడమే కాక ‘వేయివసంతాల మానవ జీవనయానం’ (2000 సంవత్సరాల తర్వాత) అంతక్రితం ‘దాస్యశృంఖలాలను తెంచుకున్న భారతజాతి’ అను శీర్షికలు కూడా నిర్వహించారు. ఈ గ్రంథాలు వారు వ్రాసిన ‘కవరు స్టోరీ’లలోని ‘వివిధ జాతీయ నాయకుల’ను గురించి, ‘కళాకారులు’, ‘సమరయోధులు’ గురించి అలాగే ‘శాస్త్రవేత్తల’ను గురించి వ్రాసిన వ్యాసాలను గ్రంథరూపములో ప్రచురిస్తున్నాము.