Book Description
ఈ గ్రంథంలో అత్యంత అవసరమైన ముఖ్య రుగ్మతలకు పరిహారాది విధానాన్ని సంక్షిప్తంగా సూచించడమైనది. అలా ఎన్నుకోబడిన అతి ప్రమాదకరమైన ఈ వ్యాధులు వందకు పైగా వుండడం వల్ల దీన్ని ‘శతరోగ నివారిణి’ అని సంభోదించడమైనది. ప్రతి వ్యాధినీ వివరించే ముందు సులభశైలిలో సూక్ష్మంలో మోక్షం అనేటట్లుగా పద్య వివరణల్ని సేకరించడమైనది. ఇందలి ఔషధాలు.. మూలికలు.. బజార్లలో సులభంగా దొరుకుతాయి. పల్లెసీమ జనానికి పచ్చి మూలికలే లభ్యమయ్యే వీలుంది. కాబట్టి అవి అత్యంత అనుయుతమైనవిగాన స్వయంగా అలాంటి మూలికల్నే సంగ్రహించుకొని శక్తిభవ పూర్వకంగా ఆపదలో వున్న వారిని ఆదుకొనేందుకు ప్రయత్నించాలి!