Book Description
ఎన్.టి.ఆర్.
శకపురుషుడు “తెలుగదేలయన్న దేశంబు దెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స”
తెలుగు జాతి వైభవం, ప్రాభవం కోసం ఆనాడు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జీవితాంతం సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో అనూహ్యమైన, అనితర సాధ్యమైన కృషి చేసి తెలుగు వల్లభుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. 450 సంవత్సరాల తరువాత కృష్ణదేవ రాయలను మహానటుడు, ప్రజా నాయకుడు ఎన్.టి. రామారావు స్మృతిపథంలో నిలిపారు. తెలుగు భాషకు రాయలు చేసిన నిరుపమాన, నిస్వార్థమైన సేవ, తరతరాలకు ఎంత స్పూర్తినిస్తుందో అలాగే ఎన్.టి.ఆర్. తెలుగు జాతికి చేసిన మహోన్నతమైన సేవ, అంతే స్ఫూర్తిమంతంగా మిగిలిపోతుంది.
ఎన్.టి.ఆర్. ఆలోచనలు, అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. సినిమా నటుడుగా వాటిని అమలులో పెట్టిన ధీశాలి. అందుకే ఆయన ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా మిగిలిపోయాడు. రాజకీయ నాయకుడుగా ఆయన మార్గం అనితర సాధ్యం. తాను నమ్మిన సిద్ధాంతాలను కడవరకు పాటించిన కర్మయోగి, మానవతావాది ఎన్.టి.ఆర్.
1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో లక్ష్యయ్య, వెంకట రామమ్మ దంపతులకు ఎన్.టి.ఆర్. జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఇది అక్షరాలా ఎన్.టి.ఆర్. విషయంలో నిజమైంది. తల్లిదండ్రుల సంస్కారం, గురువుల మార్గ దర్శకత్వం ఆయనను ఉజ్వలమైన భవిష్యత్ వైపు నడిపించాయి.
ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా కష్టం. అయితే ఆ ఉద్యోగం ఆయనకు తృప్తినీయలేదు. తన వాటాగా లంచాలు ఇవ్వడం ఎన్.టి.ఆర్.కు అస్సలు నచ్చలేదు. అప్పటికే రంగస్థలం మీద పేరు సంపాదించిన ఎన్.టి.ఆర్.ను చూసిన దర్శకుడు సి.పుల్లయ్య "నీకు మంచి భవిష్యత్ ఉంది, సినిమా రంగంలోకి వచ్చేయ్” అని ఆహ్వానించాడు. ఆ తరువాత దర్శకుడు ఎల్.వి. ప్రసాద్, ఎన్.టి.ఆర్.కు మేకప్ టెస్ట్ చేసి ఎంపిక చేశాడు. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. మరో దర్శకుడు బి.ఏ. సుబ్బారావు ఆ మేకప్ స్టిల్స్ చూసి తాను తీయబోయే 'పల్లెటూరి పిల్ల' సినిమాలో హీరో జయంత్ పాత్రకు ఎన్.టి.ఆర్. పూర్తి న్యాయం చేస్తాడని......................