Book Description
ఎందరో మహానుభావులు భారతదేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నా, వారిలో పావువంతు వారు మాత్రమే మనకు తెలుసు. ఎవరైనా మనల్ని మీకు తెలిసిన స్వాతంత్య్ర వీరుల పేర్లు చెప్పండీ అంటే తడుముకోకుండా గాంధీ, నెహ్రూ, నేతాజీ, తిలక్, లాలాజీ, సరోజినీ నాయుడు, ఝాన్సీలక్ష్మి అని చెప్పగలం. కొంచెం ఆలోచించి ఇంకొద్దిమంది పేర్లు చెపుతాం. ఇంత వరకేనా? కాదు, మనకి తెలియనివారు వేలమంది మనదేశం కోసం ప్రాణాలర్పించారు. వెలుగు చూడని త్యాగధనులు చాలామందే వున్నారు. వారిలోని కొంతమంది వీరుల జీవితగాథలను సేకరించి యర్నాగుల సుధాకరరావుగారు క్లుప్తంగా మనకందించారు. ఒక్కొక్క కథ ఒక్కోవీరుని యదార్థగాధ. చదువుతుంటే కన్నీటిచుక్క రాలకుండా, ఒంటిపై రోమం నిక్కబొడవకుండా ఉండదు. మంచి విషయాలని కథలరూపంలో మనకందించిన సుధాకరరావుగారికి అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని మంచి కథలు వ్రాయాలని కోరుకుంటున్నాం.