Book Description
శ్రీ వేంకటాచలపతి కలియుగంలో సమస్త ప్రపంచాన్నీ నిర్వహించే దక్షత, బాధ్యతని స్వీకరించిన స్వరూపం. శ్రీ వేంకటేశ్వర వైభవం సామాన్యమైన విషయం కాదు. ఆయన పేరే వేంకటేశ్వరుడు. మిగిలిన అవతారాలకూ వేంకటేశ్వర అవతారానికీ ఒక ప్రధానమైన భేదం ఉంది. మిగిలిన అవతారాలలో ఆయనకు రకరకాలైన పేర్లు వచ్చాయి. మత్స్య, కూర్మ, వామన, నృసింహ, కృష్ణ, రామావతారాలెన్ని వచ్చినా, ఆయా అవతారాలలో స్వామికి తన గుణాలను ఆవిష్కరించడం చేత ఒక ప్రత్యేకమైన నామంచేత పిలువబడ్డాడు. కలియుగంలో పిలువబడే పేరు వేంకటేశ్వరుడు. ఆయన తీసుకునేది కూడా తల వెంట్రుకలు. చాలా చిత్రమైన విశేషం. వేంకటేశ్వరుడు అన్న పేరులోనే ఉంది రహస్యమంతా.