Book Description
ఉస్తాద్ జీ కుటీర ప్రాంగణంలో కొత్తగా తయారుచేసిన పానపాత్ర మీద ఏవో అందాలు చిత్రిస్తున్నది సాఖీ. ఉస్తాద్ జీ గుడారం బయటికి వచ్చారు. చెట్లనీడలు చేతులు సాచి ముందుకు వాలుతున్నాయి. ఉస్తాద్ జీ నవ్వుకుని చేసిన ఆలోచన కవితగా ప్రవహించి రాసాగింది. లోపలా, వెలుపలా, ఆకాశం అంచులలోనూ, ధరాతలపు వేదికలోనూ, అంతటా ఒకే ఒక ఇంద్రజాలపు యవనిక వెనకాల... ప్రభాకర్ దీపం వెలుగుచుట్టూ పడే నీడలకాడలు జీవితాలు. ‘‘అన్నీ శూన్యంలో లయించిపోతాయి. అదే శూన్యంలో నీవు ఆనిని మధువూ, నీవు అనుభవించిన పెదవీ కూడా వుంటాయని విచారిస్తున్నావా వేదాంతీ?’’ వుండనీ. నువ్వు ఏ శూన్యంలో లయించిపోతున్నావో ఆ శూన్యం ఈనాడే నీలో వుందని అనుకుంటే.. అంతకంటే హీనం కాలేవు. పహ్లవీ పుష్పాలు చిరునవ్వు నవ్వినంతకాలం కెంపుమధువు నీ అరచేతి పాత్రలో నిండినంత కాలం జీవితం రాగరంజితమయే వుంటుంది.