Book Description
కోరినది పొంది సుఖించేవాళ్లు కొందరు. కోరినది లభించకపోయినా అంతకుమించి తప్తి పొందేవాళ్లు మరి కొందరు. అనుపమ చిన్నప్పటి నుండి బావ చందన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. పెద్దలందరూ ఆ ఆశాలతకు దోహదం చేశారు కూడా. కాని చందన్ సుచరితను ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. లేనిపోనివి ఊహించుకుని సుచరిత అమాయకంగా భయపడింది.. చాలాకాలం తప్పించుకు తిరిగింది... కాని అనుపమ, సాగర్ లు ఊరుకోలేదు... సుచరిత, చందన్ లిద్దరినీ తామే పూనుకుని దంపతులుగా చేశారు. కోరినది లభించకపోయినా, లభించినవారికంటే తప్తిపడే ఉత్తమురాలి కథ.... ‘వరమాల’ ‘‘ఎన్ని అనుభవాల్ని ఎదుర్కొన్నా, ఎన్ని కష్టనిష్టూరాలను చవిచూసినా నాకు అదష్టం మీద నమ్మకముంది. జీవితం ఎపుడో ఈ పచ్చిక పరుపులా అల్లుకుపోగలదన్న ఆశ ఉంది నాకు. అందుకే చెదరని ధైర్యంతో జీవితంలో నిలబడ్డాను’’ అన్నది పావని. సావిత్రి, నీలకాంత, పరమపావని ఎవరు వీరు ముగ్గురూ? హరనాథ్ మనసులో అలజడి రేపిన స్ర్తీ అసలు స్వరూపం ఏమిటి? అనేక అపోహలూ, భ్రమలూ, గొప్ప సంఘర్షణల తర్వాత గాని ‘ఆమె’ అసలు రూపం భయపడలేదు. అది తెలిసిన తర్వాత జీవితమంతా వెన్నెలే.