Book Description
అతని కృషికి ప్రభుత్వ ప్రాచ్యలిఖిత భాండాగారాధికారి, సిబ్బంది నిరంతర సహాయం లభించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో లిఖితప్రతులను కాటలాగ్ చేయడం అదృష్టం మీద ఆధారపడి ఉంది. ఈ సేకరణలో అత్యంత ప్రధానమైన రచనలు కొన్ని గ్రంథాలయాలలో లభిస్తున్నప్పటికీ వాటిని కాటలాగ్ చేయడం జరగలేదు. అందువల్ల ఇక్కడ ప్రచురించిన సేకరణలో మనకిప్పుడు తెలిసిన రాతప్రతుల జ్ఞానం తగినంత విస్తృతమే అయినప్పటికీ, వివిధ పరిశోధక బృందాలు ప్రభుత్వ లిఖిత భాండాగారం నుండి సమాచార సేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు మరెన్నో ఆకరాలను వెలుగులోకి తెస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. దాదాపు ఈ పుస్తకం మొత్తం పుర్తయి టైపింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థి శివతత్త్వరత్నాకర మనే గ్రంథాన్ని చూశాడు. విజయనగర చరిత్ర తుది కాలానికి సంబంధించి కొత్త వెలుగును ప్రసరిస్తున్న మూడు గ్రంథ భాగాలను ఈ పుస్తకంనుండి సేకరించడం జరిగింది. ఇటువంటి రచనలు మరెన్నో వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.