Book Description
శ్రీదేవి, పద్మ, చారుమతులతోపాటు వారి స్నేహం కూడ పెరుగుతూ వచ్చింది. అయితేనేం, మూడు జీవితాలూ మూడు రకాలుగా రూపొందాయి. అదృష్టవంతురాలు, శ్రీదేవికి అనురూపవరుడు దొరికి, జీవితం వడ్డించిన విస్తరిగానే సాగిపోయింది. ‘అమ్మకూచి’ ప్రాప్తించిన పద్మ బ్రతుకు అగాధాల్లో చిక్కుపడినా, బయటపడి ఆనందానికి ఎదురుచూచే భాగ్యం కలిగింది. ఎటొచ్చీ చారుమతి మాత్రమే ఎలా ఉన్నది అలా మిగిలిపోయింది - ఎవరికి అక్కరలేకుండా, ఏ అదృష్టమూ వరించకుండా, ఏటి ఒడ్డున నీటిపువ్వులాగ! వెన్నెలలో పిల్లన గ్రోవి గురించి - ఇంకా ప్రాణంతో ఉందేమని పసిపాపను కాలితో తన్నే రాక్షసుల ఇంట్లో పుట్టి ఈ పీడ ఎప్పుడు విరగడ అవుతుందనుకొనే క్రూరుల మధ్య పెరిగి చెంప పిన్నుల కోసం చిల్లర డబ్బులు తస్కరించడం మరిగి విశాల ప్రపంచంలో అడుగు పెట్టిన ‘ఎర్రతేలు’ జీవయాత్రను అభివర్ణించే ప్రశస్త మనోవైజ్ఞానిక నవల వెన్నెలలో పిల్లన గ్రోవి.